BREAKING
బిజెపి ఉచిత మెగావైద్యశిబిరం విజయవంతం బ్రిక్స్ కూటమి వైపు ఆగ్నేయాసియా దేశాల చూపు.. బహుళ ధ్రువ ప్రపంచం మరియు ప్రత్యామ్నాయ వాణిజ్యంపై ఆసియాన్ ఆసక్తి కూటమి ప్రభుత్వ పల్లెపండగ విజయవంతం చేయాలి భారత్‌లో రెండో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు రఫేల్ ఒప్పందం దోహదం.. రక్షణ కార్యదర్శి కీలక వెల్లడి ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్

భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ

Select Suryaa Now
భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ

తిరుమల మేజర్ న్యూస్,

ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది

సోషియల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని నమవద్దు

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది.టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను నిర్వహించేలా గూగుల్ క్లౌడ్  ప్లాట్ఫామ్ (GCP) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

 అధిక డిమాండ్ సమయంలో వివిధ Application, API, Gateway తదితర సేవలను అనేక రేపిలికాస్  ద్వారా నిర్వహిస్తూ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక టెక్నికల్ వార్ రూమ్ ఏర్పాటు చేసి, అప్లికేషన్ ఫర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్, ట్రాన్సాక్షన్స్, సెక్యూరిటీ  తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.

కోటాతో పోలిస్తే దాదాపు 9 రెట్లు అధిక డిమాండ్.అధిక డిమాండ్ ఉన్న బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే పూర్తవుతాయని వివరించింది.

వర్చువల్ క్యూ సాంకేతిక ట్రాఫిక్ నియంత్రణ విధానం

ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు బ్యాక్ అండ్ సిస్టమ్స్ పై అధిక భారం పడకుండా, మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు వర్చువల్ క్యూయూఏ ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వర్చువల్ క్యూయూఏ భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు ఉద్దేశించినది కాదని, అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది.అలాగే ‘ సాల్ట్ అన్వేబుల్ ’ వంటి సందేశాలు అధిక డిమాండ్ కారణంగా అందుబాటులో ఉన్న టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా రావచ్చని, దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని సాంకేతిక వైఫల్యంగా నిర్ధారించడం సరికాదని పేర్కొంది.

పేమెంట్ సమస్యలు వివిధ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి

ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ టీటీడీ అప్లికేషన్‌తో పాటు పేమెంట్ గేట్వేస్ ,బ్యాంకింగ్ నెట్వర్క్ ,యూపీఐ నెట్వర్క్  వంటి బాహ్య వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని టీటీడీ తెలిపింది. అందువల్ల ఏదైనా ట్రాన్సాక్షన్స్ విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది.టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించరాదని టీటీడీ స్పష్టం చేసింది.

నిరంతరం సాంకేతిక అభివృద్ధి 

భక్తుల ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ బ్యాంకింగ్, అప్లికేషన్  మరియు డేటాబేస్ పెర్ఫార్మెన్స్ ,హై లోడ్ హ్యాండ్లింగ్ ,సెక్యూరిటీ,  యాంటీ బోట్ మెకానిజమ్స్, పేమెంట్ ప్రాసెస్  తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.గతంలో నమోదైన ట్రాఫిక్ పార్ట్నర్ , రాబోయే బుకింగ్‌లలో ఉండే అంచనా డిమాండ్ ఆధారంగా కెపాసిటీ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేలింగ్ ను  కూడా సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తదితర ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నామని, అక్కడ భారీ స్థాయిలో ఒకేసారి ఏర్పడే డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపింది. భారీ డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక ప్రయత్నంలో టికెట్ లభించకపోవడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం లేదా లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది.భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికంగా సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ నిరంతరం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపింది. 

టీటీడీపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.