BREAKING
పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి +అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు +16న గరుడసేవ.. 17న పుష్పక విమానం.. 19న స్వర్ణరథం.. 20న చక్రస్నానం ముంపు వరి పంటను పరిశీలించిన కలెక్టర్ సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాడుల ట్రిపుల్ ఐటీ మెస్‌ను తనిఖీ చేసిన ఎంపీ కలిశెట్టి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం.. కరుడుగట్టిన టిడిపి రాష్ట్ర సీనియర్ నేత, బడుగుల పెన్నిధి శీలం వెంకటేశ్వరరావు --నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్ర స్థాయి గుర్తింపు కూటమి ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం మంత్రి చేతుల మీద అవార్డు అందుకున్న శిల్పి భువనాచారి

బిజెపి ఉచిత మెగావైద్యశిబిరం విజయవంతం

Select Suryaa Now
బిజెపి ఉచిత మెగావైద్యశిబిరం విజయవంతం

సిఎస్ పురం,మేజర్ న్యూస్ :   ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ అధ్వర్యంలో సేవాసంకల్ఫ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలకేంద్రమైన సిఎస్ పురంలోని బెల్లంకొండ విద్యామందిర్ ఆవరణలో పామూరు పట్టణానికి చెందిన శ్రీవేంకటేశ్వర వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరం మండల బిజెపి అధ్యక్షుడు పాశంరామకృష్ణ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈసందర్భంగా ముందుగా బిజెపి నియోజకవర్గ నేత కొండిశెట్టి వెంకటరమణయ్య పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ కార్యక్రమాలు నెలరోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా దేశాభివృద్ధికి ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఈసందర్భంగా ప్రముఖ3ఎముకలు కీళ్ల వైద్యనిపుణులు డాక్టర్ పి.శ్రీనాధ్,పామూరు అరుణ కంటి వైద్యనిపుణులు డాక్టర్ వై.శ్రీనివాసరావు,పామూరు శ్రీవేంకటేశ్వర వైద్యశాలకు చెందిన డాక్టర్ కొట్టేసురేష్,పామూరు సెవెన్ హిల్స్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ కాలేవెంకట్,పామూరు శ్రీనివాస పిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీనివాసమూర్తి,డాక్టర్ గౌతమి వైద్యశిబిరం నందు పలువురికి వివిధ రకాల వైద్యసేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈసందర్భంగా మారుమూల ప్రాంతమైన మండలంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన డాక్టర్ల బృందానికి బిజెపి నాయకులకు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైద్య నిపుణుల బృందం,నియోజకవర్గ బిజెపినేత కొండిశెట్టి వెంకటరమణయ్య,మండల బిజెపి అధ్యక్షుడు పాశం రామకృష్ణ,బిజెపి జిల్లాప్రధానకార్యదర్శి మాదినేని లక్ష్మణ్, జిల్లాఉపాధ్యక్షుడు నరాలశ్రీనివాసరెడ్డి,జె.సుబ్బయ్య, ఇండ్ల దుర్గాప్రసాద్,టి.శ్రీనివాసులురెడ్డి,నరసింహులు,రాయుడు,వెలిగొండయ్య పలువురు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.