BREAKING
టర్కీ రాజకీయంలో సంచలనం పల్లె పండుగకు రామాపురం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ అబద్ధాలతో కల్పిత కథనాలు అల్లుతోంది.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ధ్వజం జోధ్‌పూర్‌లో రంగులకలలు రేపుతున్న ‘తరంగ్ శక్తి 2026’ సెమీస్‌కు ముగ్గురు భారత బాక్సర్లు.. ఖాయమైన పతకాలు! జాఫ్నాలో నిషేధిత ఎల్టీటీఈ నేత దిలీపన్ విగ్రహాన్ని తొలగించిన శ్రీలంక పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత లాంగ్ జంప్‌లో ఆన్సీ సోజన్‌కు రజతం ఆసియా గేమ్స్ స్క్వాష్‌లలో భారత్‌కు రెండు రజతాలు ఆస్ట్రేలియాలో బీజేపీ చీఫ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ వీరి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కూడా హాజరు రాంచందర్‌రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఈ భేటీ నేతల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ పుష్కర ఘాట్ లో మన అడవులు తీరానికి పర్యాటక సొగసులు గుజరాత్‌లోని కీలక రైల్వే మార్గాల్లో ‘కవచ్’, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు ప్రారంభం దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జి రైలు ప్రారంభం పల్లెల అభివృద్ధే లక్ష్యం.. ప్రతి గ్రామానికీ ప్రగతి ఫలాలు గంగమ్మ తల్లికి ఘనంగా పూజలు జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు బాపూజీకి భారతరత్న తోనే నిజమైన నివాళి జలదృశ్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీసీల రాజ్యాధికారమే బాపూజీ ఆశయ సాధనకు నిలువుటద్దం : దాసు సురేశ్

మల్లాంలో కన్నులపండువగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం

Select Suryaa Now
మల్లాంలో కన్నులపండువగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం

 

*హరోం హర..శరవణభవ నామస్మరణలతో మార్మోగిన పురవీధులు*

*దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన స్వామివారు..పోటెత్తిన భక్తులు*

*చిట్టమూరు మేజర్ న్యూస్*

చిట్టమూరు మండలం మల్లాంలోని వళ్ళీ,దేవసేనా సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా,భక్తుల కోలాహలం మధ్య కనులపండువగా నిర్వహించారు.ఉత్సవమూర్తులను ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది,విశేష పూజా కార్య క్రమాలు నిర్వహించి రథంలో కొలువుదీర్చారు.పుష్పాలతో సుందరంగా అలంకరించి రథంలో కొలువుదీరిన వళ్ళీ, దేవసేనా సమేత స్వామివారు దివ్య మంగళ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.మల్లాసుర,కొల్లాసుర రాక్షసులను సంహరించి విజయుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు రథంపై కొలువుదీరి పుర వీధుల్లో ఊరేగుతుండగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో మల్లాం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఎటుచూసినా భక్తజన సందోహం కనిపించగా..హరోం హర..శరవణభవ..నామస్మరణ లతో మల్లాం పురవీధులు మారుమోగాయి.కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే తమ కోరికలు నెరవేరు తాయని భక్తులు పెద్ద ఎత్తున కొబ్బరి కాయలు కొట్టి,ఉప్పు,మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.

 

స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.రథం ముందుకు కదులుతున్న ప్రతి సారి భక్తుల హర్షధ్వానాలు, శరవణభవ నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

 

స్థానికులు సేవాభావంతో మజ్జిగ ప్యాకెట్లు,వాటర్ ప్యాకెట్లు,పులిహోర,కూల్‌డ్రింక్స్ పంపిణీ చేశారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి శ్రీ షణ్ముఖ ఆక్వా నీడ్స్ అధినేత కాపులూరు బాలాజీ ఉభయకర్తగా వ్యవహరించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు వసతులు కల్పించడంతో పాటు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో రథానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.రంగు రంగుల పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారి దివ్యదర్శనం 

భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.స్వామివారి రథోత్సవాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు.హరోం హర.. శరవణభవ..నామస్మరణలతో సాగిన మల్లాం స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భాజా భజంత్రీలు,బాణాసంచా వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు.భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఈవో పెంచల వర ప్రసాద్‌,వాకాడు సిఐ హుస్సేన్ భాషా,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, తెదేపా నాయకులు నల్లారెడ్డి రాజేష్‌ రెడ్డి,మల్లాం,చిట్టమూరు పీఏసీఎస్‌ అధ్యక్షులు రామిశెట్టి హరినాథ్‌, గుండుబోయిన కస్తూరయ్య,తెలుగు దేశం పార్టీ మండల యువత అధ్యక్షుడు దువ్వూరు సాయిమౌళి రెడ్డి,బీసీవై పార్టీ మండల అధ్యక్షులు వంకా రమణయ్య,ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు చెన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి,చిల్లకూరు సాయి కుమార్‌ రెడ్డి,పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి,మాజీ జడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ,తహసీల్దార్ రామయ్య, ఆయా శాఖల అధికారులు,పలువురు ప్రముఖులు,అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.