కూటమి ప్రభుత్వ పల్లెపండగ విజయవంతం చేయాలి
సిఎస్ పురం, మేజర్ న్యూస్ :
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 29వతేది మంగళవారం నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో జరిగే పల్లెపండగ 3.0 కార్యక్రమాన్ని మండలంలోని తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని మండల టిడిపి పరిశీలకులు నక్కశ్రీను,మండల టిడిపి అధ్యక్షుడు బొబ్బూరిరమేష్,నాయకులు అన్నారు.ఆదివారం స్థానిక మండల టిడిపి కార్యాలయంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి పల్లెపండగ కార్యక్రమం కింద రహదారులు తాగునీటి వసతులు గ్రామాలకు సంభందించి ఇతర మౌళిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా పల్లెపండగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా మనసరిహద్దు ప్రాంతమైన వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో పల్లెపండగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రప్రభుత్వ పెద్దలు కూటమినేతలు పాల్గొంటున్నారని కనిగిరి ఎమ్మెల్యే,ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నాయకత్వంలో మండలం నుండి టిడిపి జనసేన బిజెపి కూటమి శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో మండల పరిశీలకులు నక్కశ్రీను,మండల టిడిపి అధ్యక్షుడు బొబ్బూరిరమేష్,ప్రభుత్వ కనీసవేతనాల సలహామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య, ఒంగోలు పార్లమెంట్ టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి యన్.సి.మాలకొండయ్య, సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి,మన్నేపల్లి శ్రీనివాసులు,తోడేటిగోపి,పాలకొల్లు వెంకటరెడ్డి,షేక్ అబ్దుల్లా,కె.వెంకటకొండయ్య,దాసరి మల్లికార్జున,బిజెపినేత యం.లక్ష్మణ్,బి.వెంకటాద్రి,మహబూబ్ బాషా,,అమడసాని బాలకేశవరెడ్డి,డాక్టర్ అక్బర్, వెంకటేశ్వర్లు,మాల్యాద్రి,ఖాజావలి,గుర్రంనాగేశ్వరరావు,పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.