చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప పోరాట యోధురాలని అన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం, జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఆర్‌ఐ జానయ్య, ఫింగర్‌ప్రింట్స్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, వెల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం, ఆర్‌ఎస్‌ఐ అన్వర్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.