BREAKING
ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్! సికింద్రాబాద్ జీఎంఆర్ స్ప్రింగ్‌ఫీల్డ్స్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. రికార్డు స్థాయిలో రూ.1,62,111కు అమ్ముడైన లడ్డూ తాండూరులో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

రేపు బ్యాంకులు పనిచేస్తాయ్..

Select Suryaa Now
రేపు బ్యాంకులు పనిచేస్తాయ్..

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సెలవు రోజైన సెప్టెంబర్‌ 27, ఆదివారం బ్యాంకులు పనిచేయనున్నాయి. సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం మేరకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సెప్టెంబర్‌ 27న సాధారణంగా పనిచేస్తాయి. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ చెస్టులు ఆదివారం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. 

సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఐదు రోజుల బ్యాంకింగ్‌ వారాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. 

వరుస సెలవులు, సమ్మె కారణంగా బ్యాంకింగ్‌ సేవలు ఐదు రోజుల పాటు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం బ్యాంకులను తెరవాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కొన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆదివారం విధులకు హాజరుకావద్దని సూచించడంతో శాఖల కార్యకలాపాల విషయంలో కొంత అనిశ్చితి కొనసాగుతోంది. 

ముఖ్యంగా: కేంద్రం అధికారిక ప్రకటనలో ఆదివారం తెరిచి ఉండేవిగా ప్రభుత్వ రంగ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను పేర్కొంది. కాబట్టి ప్రతి ప్రైవేటు బ్యాంకు శాఖ కూడా తప్పనిసరిగా పనిచేస్తుందని భావించకండి.