అక్టోబర్ 4న తెలంగాణకు అమిత్ షా
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
కరీంనగర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లపై దృష్టి సారించనున్నాయి. ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, కార్యక్రమ వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో రాజకీయంగా అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.