BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

Select Suryaa Now
నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

నాగాలాండ్‌లో కల్తీ మద్యం ప్రాణాలు తీసింది. రెండు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్న 19 మంది మృతి చెందారు. ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

కల్తీ మద్యం విక్రయాలు, సరఫరా వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 3 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం నమూనాలను పోలీసులు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. మద్యంలో విషపూరిత లేదా ప్రమాదకర రసాయనాలు కలిశాయా? వాటి కారణంగానే మరణాలు సంభవించాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల మృతదేహాలకు సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు కూడా కీలకంగా మారనున్నాయి.

కల్తీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.