BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

నోటీసులు అందుకున్నవారు బీఎల్‌వోలను కలవాల్సిన అవసరం లేదు

Select Suryaa Now
నోటీసులు అందుకున్నవారు బీఎల్‌వోలను కలవాల్సిన అవసరం లేదు

ఢిల్లీ: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్‌.ఎస్‌. సంధు, వివేక్‌ జోషి సమావేశంలో పాల్గొన్నారు. 

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై తప్పనిసరిగా బూత్‌ స్థాయి అధికారులను కలవాల్సిన అవసరం లేదని సీఈసీ స్పష్టం చేసినట్లు సమాచారం. బీఎల్‌వోలే ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన వివరాలు, పత్రాలను సేకరిస్తారు.

అలాగే ఓటర్లు సమర్పించే పత్రాలను బీఎల్‌వోలే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రత్యేక సమగ్ర సవరణలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ, సేకరణ, ధ్రువీకరణ చేపట్టే విధానం ఇప్పటికే ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో ఉంది. 

నోటీసులు అందుకున్న ఓటర్లకు ప్రక్రియను సులభతరం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణపై పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతోంది.