మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి
సూర్య జగిత్యాల ప్రతినిధి: మన ఊరు మనబడి కింద మంజూరైన జగిత్యాల పట్టణ, బుగ్గారం మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మండల పరిషత్ పాఠశాలలకు కలర్స్ వేయుటకు అంచనాలు, సాంకేతిక మంజూరు చేసి పెయింట్స్ పూర్తి చేయాలని ఇరిగేషన్ డివిజన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏకే ఖాన్ కు పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించినట్టు వారు వివరించారు.