తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం : సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : ఈనెల 26న (గురువారం) బి.కొత్తకోట మున్సిపాలిటీ,సంబేపల్లి 9,రామాపురం 2 పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కున
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : ఈనెల 26న (గురువారం) బి.కొత్తకోట మున్సిపాలిటీ,సంబేపల్లి 9,రామాపురం 2 పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు,సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు.అత్యవసర పరిస్థితుల కోసం స్ట్రైకింగ్,రిజర్వ్ ఫోర్సులు సిద్ధం చేశారు.రౌడీషీటర్లు,బైండోవర్ వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు.ఓటు వేశాక పోలింగ్,కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా తిరగకుండా కట్టడి చేయడం,పోలింగ్ కేంద్రాలకు 100-200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్,బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా,అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు.ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని,అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి