BREAKING
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే. జిల్లా స్థాయి పాత్రధారణ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు బీరంగూడ పాఠశాల బృందం ఎంపిక అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు

పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు.

Select Suryaa Now
పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు.

 అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార కూటమి నాయకులు పోలీసు, ఎన్నికల యంత్రాంగం అండతో అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలును అడ్డుకోవడం, ఓటింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడటం, కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను తారుమారు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాడిపత్రిలో పట్టపగలే పెట్రోల్ బాంబులతో దాడులు జరిగి వాహనాలు, ఇళ్లకు నష్టం వాటిల్లినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని, బాధితులపైనే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తూ హౌస్ అరెస్టులకు పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు. శింగనమలలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మహిళలు, పిల్లలపై దాడులు జరిగాయని, మధ్యాహ్నం 3 గంటల వరకు జరగాల్సిన ఎన్నికను 1.20 గంటలకే ముగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో నామినేషన్ల దశ నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయని, డీఎస్పీ, సీఐల సమక్షంలోనే నాలుగు జెడ్పీటీసీ, సుమారు 38 ఎంపీటీసీ స్థానాల ఫలితాలను తారుమారు చేశారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు ప్రకటించడం, ఓడిన వారిని గెలిచినట్లు చూపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, పామిడి ప్రాంతాల్లో అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను బెదిరించారని, ఏకగ్రీవ ఎన్నికల కోసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రలోభాలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని వై. వెంకట్రామిరెడ్డి తెలిపారు. గంజాయి ముఠాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, నామినేషన్లను తిరస్కరించడం, అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలు, పిల్లలపై దాడులు జరగడం పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమన్నారు. శోధనపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఎన్నికల అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తాడిపత్రిలో పెట్రోల్ బాంబుల దాడులు, వాహనాల దహనం, ఇళ్లపై దాడులు జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోనూ అక్రమాలు జరిగాయని, పలు స్థానాల్లో రీకౌంటింగ్ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు తావులేకుండా చూడాలని కోరారు. ఎన్నికల అక్రమాలను చిత్రీకరించకుండా మీడియాను అడ్డుకోవడం పత్రికా స్వేచ్ఛకు విఘాతమని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఓటు హక్కును కాపాడుకునేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి