డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన
నగరం, మేజర్ న్యూస్: డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై మండల పరిధిలోని
రైతు సేవ కేంద్రాల సిబ్బంది, ఎరువుల షాపు డీలర్లకు ఇంచార్జీ రేపల్లె వ్యవసాయ సహాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు అవగాహన కల్పించారు. శనివారం మండల కేంద్రమైన నగరం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన
అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎరువుల కొనుగోలు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారా రాబోయే రోజుల్లో రైతులు, రిటైలర్లు ఈ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు ఎలా చేయాలో తెలిపారు. ప్రతి డీలర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ఈ యాప్ గురించి ప్రతి రైతుకి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవ కేంద్రాల సిబ్బంది, మండల పరిధిలోని ఎరువుల షాపు డీలర్లు పాల్గొన్నారు.