telangana
ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి
సూర్య దండేపల్లి : ఆంగ్లం అంటే ఎటువంటి భయాందోళనకు గురికాకుండా పట్టు సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాధికారి మంత్రి రాజు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శోభ పేర్కొన్నారు.. ఆంగ్ల భాష ఉపాధ్యాయుల అసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శనివారం ఒలంపియాడ్, ఎడ్యు టాక్ పోటీలు నిర్వహించారు.. వీటిని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ పోటీల్లో ఓడిపోయిన మరింత పట్టుదలతో ముందుకు సాగాలన్నారు... ఒలంపియాడ్ లో సీనియర్ విభాగంలో ద్వారక ఉన్నత పాఠశాలకు చెందిన రఘువర్ధన్ ప్రథమ స్థానం, జూనియర్ విభాగంలో వెలగనూరు పాఠశాలలకు చెందిన రాజవీర్ సూర్య ప్రథమ స్థానం, ఎడ్యుటాక్ పోటీలో గుడిరేవు కు చెందిన అహల్య ,అర్చన సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో ప్రథమ స్థానం గెలుచుకున్నారు.. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు అప్పాల మనోహర్, ఎల్టా మండల కన్వీనర్ ముత్తే వెంకటమల్లు, ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రూపాచారి, ఉమ తదితరులు పాల్గొన్నారు...