BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు

ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై

Select Suryaa Now
ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై

సూర్య నస్పూర్ : ఎస్‌ఆర్‌పీ 1 గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో శనివారం అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా తెలుసుకున్నామని తెలిపారు. కోల్ కట్టర్లకు అవసరమైన నాలుగు అడుగుల డ్రిల్ రాడ్లు సక్రమంగా సరఫరా కావడం లేదని, లైన్ కార్మికులకు అవసరమైన లైన్‌మెన్ కిట్లు అందుబాటులో లేకపోవడంతో విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కార్మికులకు నాణ్యమైన షూలు, హ్యాండ్ గ్లౌజులు సరఫరా చేయాలని కోరారు. ఈ సమస్యలను గని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అనంతరం యూనియన్ సీనియర్ నాయకుడు పెండ్లి రవీందర్‌ను ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ పెట్టం లక్ష్మణ్, సెంట్రల్ కమిటీ నాయకులు నీలం సదయ్య, కోలిపాక సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ రామిడి మహేందర్ రెడ్డి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.