BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క

Select Suryaa Now
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క


    మహేశ్వరం, మేజర్ న్యూస్ : మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
        శనివారం మహేశ్వరం మండలంలోని కాకి ఈశ్వర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, కొత్తగా మంజూరైన పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్  ఫేజ్-1 రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
        ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించిందని, పలుమార్లు గడువు పొడిగించిందని తెలిపారు. మొదట సుమారు 4.50 లక్షల దరఖాస్తులు రాగా, అనంతరం మరో 13 వేల మందిని అదనంగా గుర్తించామని పేర్కొన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, భర్త లేని మహిళలతో పాటు ఎయిడ్స్, డయాలసిస్, బోధకాలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.75 లక్షలకు పైగా కొత్త పింఛన్ల మొత్తాన్ని ఈ నెల 26వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
        మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు, అవసరాన్ని బట్టి రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు చిన్న వ్యాపారాలు, మొబైల్ టిఫిన్ కేంద్రాలు, కుట్టు కేంద్రాలు, దుకాణాలు తదితర స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. మహిళలకు భద్రత, గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీద మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డులను కూడా మహిళల పేరుమీద అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
        మహేశ్వరం నియోజకవర్గంలో 4,733 కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 30,215 పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించామని, త్వరలో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యాపార కేంద్రాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని, పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో లబ్ధిదారులకు తాగునీరు, భోజనం తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, ప్రజలు ఓపికతో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు.
        ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులకు కొత్త పింఛన్లు అందించడం సంతోషకరమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసినందుకు అభినందనలు తెలిపారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు కూడా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ, కొత్త పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) డాక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, పీడీ డీఆర్డీఏ శ్రీలత, మహేశ్వరం ఎంపీడీఓ శారదమ్మ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పాల జనార్ధన్ మేజర్ న్యూస్ మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా