వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ
సూర్య బెజ్జుర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం ఉట్స్ సారంగపల్లి గ్రామపంచాయతీలో వీఓ (విలేజ్ ఆర్గనైజేషన్) భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. వీఓ భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యకలాపాలకు సౌకర్యం కలగనుంది.ఈ కార్యక్రంలో సర్పంచ్ శ్రీహరి, ఉపసర్పంచ్ రవీందర్ గౌడ్, కార్యదర్శి ధర్మయ్య, ఏ పి ఓ మోహన్ దాస్,మహిళా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.