మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప, శివ మాలధారులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం తన భాగ్యంగా భావిస్తున్నానని ముదిగుబ్బ నూతన జడ్పిటిసి సానే రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక పంచ గిరీష అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్తల కమిటీ కోరిక మేరకు సొంత నిధులతో శనివారం సుమారు 600 అయ్యప్ప, శివ మాలధారులకు సొంత నిధులు వెచ్చించి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు, అలాగే దేవాలయ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త సోమగట్టు సింగారెడ్డి మాట్లాడుతూ తమ వినతి మన్నించి అయ్యప్ప మాలదారులకు అన్నవితర నిర్వహించడం భగవంతుని ప్రేరణ అని ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు