BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు

బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు.......

Select Suryaa Now
బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు.......

మద్దూర్ .....మండలంలోని బైరాన్ పల్లి గ్రామాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి శుక్రవారం గ్రామ సర్పంచ్ బర్మ రాజ మల్లయ్య తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైరాన్ పల్లి గ్రామ విశిష్టతను అధ్యయనం చేయడం కోసం గ్రామాన్ని సందర్శించినట్లు తెలిపారు. బైరాన్ పల్లి పోరాట చరిత్రను విశిష్టతను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. బైరాన్ పల్లి గ్రామంలో ఉన్న రజాకార్లను ఎదిరించడానికి కట్టిన బురుజును అంగడి వీరన్న గుడిని పురాతన భైరవ దేవాలయాన్ని సందర్శించారు. సర్పంచ్ మాట్లాడుతూ గతంలో ఇదే అంశం మీద హెరిటేజ్ సంచాలకులు అర్జున్ రావు అధ్యయనం చేసి వెళ్లినట్లు సర్పంచ్ రాజమల్లయ్య సంచాలకులు నరసింహారెడ్డికి వివరించారు. బైరాన్ పల్లి నీ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం వీర బైరాన్ పల్లి గా మార్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈరోజు తెలంగాణ భాష సాంస్కృతిక పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. బైరాన్ పల్లి నీ పర్యాటక కేంద్రంగా గుర్తించాలని వీర బైరాన్ పల్లి గా మార్చాలని కోరారు. గ్రామానికి ఎంతోమంది ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు వచ్చి హామీలు ఇచ్చి వెళ్తుంటారు తప్ప గ్రామ అభివృద్ధికి సహకరించిన వారు ఎవరు లేరని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బైరాన్ పల్లి చరిత్రను గుర్తించి బైరాన్ పల్లి చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.