BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు

పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

Select Suryaa Now
పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.  43 ఏళ్ల చరిత్ర లో పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది.  శనివారం నామినేషన్ ల పరిశీలన అనంతరం ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. సర్పంచ్ కు, ఒకటవ వార్డు కు డమ్మీ అభ్యర్థులు నామినేషన్ లు ఉప సంహరించు కొన్నారు. దీంతో ఈ పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. దీనికి కారణం ఏదైనా పంచాయతీ ఏకగ్రీవం కావాలంటే ఆయా వార్డు సభ్యులు అన్ని పార్టీలు పంచుకుంటాయి. ఒకవేళ కూటమి బలం ఎక్కువగా ఉంటే కూటమి పార్టీలు పంచుకుంటాయి. ఇక్కడ వీటికి భిన్నంగా సర్పంచ్ తో సహా ఎనిమిది మంది వార్డు సభ్యులు సైతం టిడిపి కి చెందిన వారే ఏకగ్రీవం కావడం రాష్ట్రంలో రికార్డు గా చెబుతున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఈ రికార్డు నెలకొంది.  అచ్యుతాపురం గ్రామం లో ఎనిమిది వార్డు లలో , గ్రామ సర్పంచ్ అందరూ టిడిపి వారే ఏకగ్రీవం అయ్యరు. అధికారికంగా సోమవారం ప్రకటిస్తారు. సింగిల్  నామినేషన్ లు ఉండడం తో ఇప్పటికే సాంకేతికంగా ఏకగ్రీవం అయినట్లే. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 24 సాయంత్రం అధికారికంగా ఏకగ్రీవ పంచాయతీల జాబితా ప్రకటిస్తుంది.శనివారం నామినేషన్లు పరిశీలన పూర్తి అయింది.  అన్ని నామినేషన్ లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఉపసంహరణ అనంతరం సింగిల్ నామినేషన్ లు మిగిలినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో మొత్తం పంచాయతీ పాలక వర్గం టీడీపీ కి సొంతం  అయింది. ఈ గ్రామం సర్పంచ్ పదవి బిసి జనరల్ కు కేటాయించారు. టిడిపి నాయకులు చెన్నోజు వీర్రాజు(నాని) సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయి  చరిత్ర సృష్టించారు. ఒకటవ వార్డు మెంబర్ గా వల్లూరి సతీష్, రెండు వార్డు రిమ్మలపూడి అమ్మిరాజు, మూడో వార్డు దేవరపల్లి వెంకట లక్ష్మి, నాలుగు వార్డు బత్తిన రాజు, ఐదో వార్డ్ జగ్గరపు సత్య ప్రసాద్, ఆరో వార్డు పొన్నమండ సోమాలమ్మ, ఏడో వార్డులో చిట్టూరీ లక్ష్మీ, ఎనిమిది వార్డు బోకూరి లిల్లీ పుష్ప లు వార్డు పంచాయతీ సబ్యులు గా ఏకగ్రీవం  అయ్యరు.