BREAKING
పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఉమా వైష్ణవి ఎంపిక జీవిత బీమా నమోదు ప్రారంభం దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ.

Select Suryaa Now
దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు షబానా, చాంద్ బీ, దిల్షాద్‌లపై రాత్రి జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రస్తుతం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతో పాటు వారికి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ధర్మతేజ బాధితులకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలకు పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.