BREAKING
పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఉమా వైష్ణవి ఎంపిక జీవిత బీమా నమోదు ప్రారంభం దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

Select Suryaa Now
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

రామాయంపేట : విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జేసీ)లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థినీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి లక్షణాలే భవిష్యత్తులో విజయానికి పునాదులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు