BREAKING
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకాన్ని అందాలా కృషి చేయాలి జెడ్పి సీఈవో ఎల్లయ్య గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి-డాక్టర్ కె.సుజాత పోలీసుల, ఎన్నికల యంత్రాంగం అండతో ప్రజాస్వామ్యం ఖుని...ఎస్పీ జగదీష్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి దర్శి మున్సిపాలిటీ అభివృద్దే ద్యేయంగా పనిచేసిన చైర్మన్ పిచ్చయ్య. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి మాలదారుల కు అన్నవితరణ తన భాగ్యం, సానేరంజిత్ కుమార్ రెడ్డి ఎస్ఆర్పి 1 గనిలో టీబీజీకేఎస్ అలై బలై మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన రాజస్థానీ మార్వాడీ రుచులు – తెలుగు ప్రజల ఆతిథ్యానికి సరికొత్త చిరునామా బాలాజీ ఫ్యామిలీ ధాబా పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన

సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి

Select Suryaa Now
సురేఖమ్మ సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విలువైనవి
సూర్య, మందమర్రి : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి మాజీ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ అందించిన సేవలు చిరస్మరణీయమని పీసీసీ సభ్యుడు నూకల రమేష్ అన్నారు. శనివారం మందమర్రి పట్టణంలో సురేఖమ్మ 63వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ పట్ల ఆమెకున్న నిబద్ధతను, నాయకత్వ పటిమను కొనియాడారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సురేఖమ్మ కీలక పాత్ర పోషించారని నూకల రమేష్ పేర్కొన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషి అభినందనీయమన్నారు. రాజకీయాల్లో సేవాభావంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సురేఖమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు విస్తృత సేవలందించాలని కోరారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నడిగోట నరేందర్, కోపర్తి నవీన్, అశోక్, రంజిత్, అనిరుధ్, అక్బర్, రమేష్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొని సురేఖమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.