అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత
లింగాల :
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి
కలను సహకారమే కాంగ్రెస్ ప్రజా
పాలన ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా
ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని,అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని
అచ్చంపేట శాసనసభ్యులు
డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం లింగాల,
లబ్ధిదారులకు చేయూత ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 488 మందికి మంజూరు పత్రాలను మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగినేని శ్రీనివాసరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడం, అర్హులైనభుత్వ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సాంకేతిక కారణాలతో పింఛన్ రానివారు అదేవిధంగా ఆగిపోయిన అర్హులు సంబంధిత
పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులకు పింఛన్ ఇప్పిస్తామనీ భరోసా కల్పించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ఇళ్ల మంజూరులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం దేశానికే ఆదర్శమని, పేదలు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. ఆసరా పింఛన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు,ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. పేదరిక నిర్మూలన ధ్యేయంగా
పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ప్రజలకు సరియైన
న్యాయం జరుగుతున్నదని అన్నారు. పేదలకు అండగా
నిలిచే కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి
సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రంగినేని శ్రీనివాసరావు, సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.