అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సహాయం అందించేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చొరవ తీసుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామానికి చెందిన పులిపిరి ఎల్లయ్య భార్య అంతమ్మ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసీని మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న స్పీకర్ వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చొరవ చూపారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అంతమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఎవరికీ కష్టం వచ్చినా అండగా ఉంటానని, బాధిత కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అత్యవసర సమయంలో స్పందించి వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.