BREAKING
రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే.

ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు

Select Suryaa Now
ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణతో తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను కోల్పోయే పరిస్థితి ఎదురవుతుండటంతో భూ బాధితులు ఉద్యమబాట పట్టారు. తమ భూములను కాపాడుకునేందుకు సంఘటిత పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వికారాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నూతన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేసుకున్నారు. భూముల పరిరక్షణే లక్ష్యంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు.నూతన జేఏసీ గౌరవ అధ్యక్షుడిగా న్యాయవాది శుభప్రద్ పటేల్, అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పద్మారావు, గోవర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, రమ్దాస్, సంయుక్త కార్యదర్శులుగా డి. రవి, నరసింహారెడ్డి, తాజుద్దీన్, సుషీలా ఎంపికయ్యారు. ప్రధాన సలహాదారులుగా ప్రకాశ్ రావు, చాన్ పాషా, సత్యనారాయణలను నియమించారు.ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడుతూ… ఆర్‌ఆర్‌ఆర్ పాత అలైన్‌మెంట్‌ను మార్చడానికి గల కారణాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులు, వారి బంధువుల భూములకు నష్టం కలగకుండా అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారంటూ ఆరోపించారు. అలైన్‌మెంట్ మార్పుల వెనుక ఉన్న కారణాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు.తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూములే కుటుంబ పోషణకు, భవిష్యత్తుకు ఏకైక ఆధారమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను కోల్పోతే తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునేది లేదని, హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. భూ బాధితులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన జేఏసీ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, భూ బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.