BREAKING
రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే.

వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్  ప్రతినిధి ;  మెదక్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వెట్‌ల్యాండ్ మేనేజ్‌మెంట్ కమిటీ  శనివారం నాడు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా జిల్లాలోని తడి భూముల (వెట్‌ల్యాండ్స్) పరిరక్షణ, అభివృద్ధి, నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ...వెట్‌ల్యాండ్స్ యొక్క పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వాటిని కాలుష్యం బారిన పడకుండా సంరక్షించాలని కలెక్టర్ సూచించారు.

తడి భూముల ఆక్రమణలను అరికట్టడంతో పాటు, నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వెట్‌ల్యాండ్స్ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నిబంధనల ప్రకారం వాటి నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.సమావేశానికి హాజరుకాని ఇరిగేషన్ శాఖ అధికారికి మెమో ఇవ్వాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు రిపోర్ట్ పంపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అటవీ అధికారి జోజి, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులు, అటవీ శాఖ సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.