BREAKING
హిందూపురంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు.. రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏకాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం

Select Suryaa Now
మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం
సూర్య, మందమర్రి : మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతుందని సింగరేణి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశం అన్నారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మందమర్రి పట్టణ పరిధిలోని సింగరేణి మహిళా జూనియర్ కళాశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని ప్రజలకు సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరిస్తూ సమాజంలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేశం మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ సమయంలో అలవడే మంచి నడవడిక భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు ఆరోగ్యం క్షీణించి జీవిత లక్ష్యాలు దూరమవుతాయని తెలిపారు. యువత తమ విలువైన జీవితాన్ని వ్యసనాలకు బలిచేయకుండా, విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ఒకరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులు నిర్వహించిన ర్యాలీ ప్రజల్లో మత్తు పదార్థాలపై చైతన్యం కలిగించే దిశగా నిలిచింది.