హిందూపురంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు..
హిందూపురం టౌన్ మేజర్ న్యూస్;
హిందూపురంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు
..హిందూపురం పట్టణంలోని ఏఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో హిందూ-ముస్లింలు ఐక్యంగా మహావీరుడు షహీద్ టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కల్లూరు ఉమర్ ఫరూఖ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో షహీద్ టిప్పు సుల్తాన్ జాతీయ పురస్కారం-2026ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా టిప్పు సుల్తాన్ 7వ తరం వారసుడు, తెహ్రిక్-ఎ-ఖుదాదాద్ జాతీయ అధ్యక్షుడు సాహెబ్జాదా సయ్యద్ మన్సూర్ అలీ టిప్పు, విశిష్ట అతిథిగా మహా ఆచార్య శ్రీ రవిశంకర్ గురూజీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ - టిప్పు సుల్తాన్ హిందూ-ముస్లిం ఐక్యత, మాతృభూమి స్వాతంత్ర్యం కోసం రాజీలేని పోరాటం చేశారని, శృంగేరి శారదా పీఠాన్ని రక్షించి, వందలాది దేవాలయాలకు సహాయం అందించారని కొనియాడారు.
అనంతరం టిప్పు వేషధారణ, వ్యాసరచన, ప్రసంగం, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న 500 మంది విద్యార్థులకు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జేవీ అనిల్ కుమార్, డీఈ రమేష్ కుమార్, ఏసీ నాగరాజు, వివిధ మత సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు, హిందూపురం