BREAKING
బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్.. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

పేదల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక పండుగల సాయన్నః మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి

Select Suryaa Now
పేదల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక పండుగల సాయన్నః మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి

సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః పేదల ఆత్మగౌరవం, హక్కులు, గౌరవప్రదమైన జీవనం కోసం పోరాడిన మహనీయుడు పండుగల సాయన్న అని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజ్‌లతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో పండుగల సాయన్న విగ్రహాన్ని మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పండుగల సాయన్న జీవితం, ఆయన చేసిన పోరాటాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న గౌడ్, కొమురం భీమ్ వంటి ప్రజానాయకులతో పాటు పండుగల సాయన్న సేవలు, పోరాటాలను పాఠ్యాంశాలు, సాహిత్యం, సినిమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విగ్రహం కేవలం ప్రతిమ మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, హక్కుల కోసం సాగిన పోరాటానికి ప్రతీక అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ముదిరాజ్‌లతో పాటు అన్ని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విద్య, ఆర్థిక ప్రగతి, ఐక్యత ఎంతో ముఖ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రతి కుటుంబం పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర వర్గాలతో ఘర్షణలకు తావులేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు. మత్స్యకారుల జీవనోపాధి, ఆదాయం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కొల్లాపూర్ నియోజకవర్గంలోని మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ కేటగిరీ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రస్తుతం బీసీ-ఏలో ఉన్న వర్గాలకు ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ పిల్లలకు తగిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. బీసీ-జీ కేటగిరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేపల పెంపకంతో పాటు కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి అన్నారు. ఈ సదుపాయాల ద్వారా చేపలకు మెరుగైన ధర లభించడంతో పాటు మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని వివరించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ వర్గీకరణపై వస్తున్న అభ్యర్థనలను న్యాయబద్ధంగా పరిశీలించి విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. 'మన నిజమైన ఆస్తి మన పిల్లలు.. వారి ఆస్తి చదువు' అని పేర్కొన్న జూపల్లి, ప్రతి కుటుంబం పిల్లల విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, పండుగల సాయన్న ఆశయాలను ఆచరిస్తూ పేదల కష్టాల్లో భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి, మత్స్యకారులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మత్స్యకార సోదరసోదరీమణులకు అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.