సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః నిజామాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, ధర్మపురి సంజయ్, మానాల మోహన్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.