BREAKING
ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష.. నో వార్నింగ్ డైరెక్ట్ యాక్షన్.. ఐలాపూర్ తాండాలో కూచివేతల మోత ఒకే దెబ్బకు 75 అక్రమ నిర్మాణాలు ఖతం ఈనెల 23న దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో మరో చమురు రవాణా నౌకపై దాడి పేద కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం  అందోల్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి అరుణ కుమారి గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు! ఎర్రగూడూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గట్టు శివ గౌడ్ నామినేషన్ దాఖలు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక బీహార్‌లో రూ.4,280 కోట్ల నితీశ్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌

విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి

Select Suryaa Now
విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి

 

గాజువాక, మేజర్ న్యూస్ : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని స్టీల్ సీఐటీయూ అధ్యక్షుడు యు.రామస్వామి డిమాండ్ చేశారు. అఖిల భారత సీఐటీయూ పిలుపు మేరకు డిసెంబరు 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ‘చలో దిల్లీ’ కార్యక్రమ గోడపత్రికలను శనివారం ఉక్కునగరంలోని స్మృత్యాంజలి పార్క్ వద్ద నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. దేశంలోని మరో నాలుగు ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న కేంద్రం, విశాఖ ఉక్కు విషయంలోనే మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్‌ల నిరంకుశ అమలు, వేతన సవరణ నిలిపివేత, పనిభారం పెంపు వంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన ‘చలో దిల్లీ’లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి.శ్రీనివాసరాజు, సీఐటీయూ నాయకులు మరిడయ్య, బి.మహేష్, టి.వి.కె.రాజు, మొహిద్దిన్, తిమోతి బాబు, పవన్, బొంజు బాబు, అప్పలరాజు, మురళి, నాగబాబు, సిహెచ్.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : పీ. కోటిరెడ్డి, గాజువాక ఇంచార్జ్, విశాఖపట్నం