మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా
గతంలో 1995, 2001, 2014 ఎన్నికల సమయంలో లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారని మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు.
ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే యారపతినేని శ్రీనివాసరావు ఉన్న సమయంలో గత ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి పరిస్థితులు ఎందుకు లేవని నిలదీశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున 28 నెలలకు 42 వేల రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 84 వేల రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.
మహాభారతంలో కౌరవులు పాండవులను ఓడించామని సంబరపడినా, చివరకు కురుక్షేత్రంలో ఓటమి తప్పలేదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని కూటమి నేతలు భావిస్తున్నారని, రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పోలీసులు జారీ చేసిన ఆదేశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల