BREAKING
బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్.. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్

Select Suryaa Now
మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్
సూర్య తిర్యాణి : తిర్యాణి, మందగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద శనివారం చిన్నారులకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. వైద్య సిబ్బంది చిన్నారులకు టీకాలు వేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ తుమ్రం గోపాల్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. టీకాల ప్రయోజనాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని, తమ పిల్లలకు నిర్ణీత టీకాల పట్టిక ప్రకారం సరైన సమయంలో టీకాలు వేయించాలని సూచించారు. సకాలంలో టీకాలు వేయించడం వల్ల పలు అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు. ఏ టీకా ఎప్పుడు వేయించాలనే సందేహాలు ఉంటే ఏఎన్ఎం లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్, ఏఎన్ఎం, అంగన్‌వాడీ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీ లతశ్రీ తదితరులు పాల్గొన్నారు.