BREAKING
గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు! ఎర్రగూడూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గట్టు శివ గౌడ్ నామినేషన్ దాఖలు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక బీహార్‌లో రూ.4,280 కోట్ల నితీశ్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ పట్టణంలోని గొల్లపేట్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీమా నమోదు తీరును పర్యవేక్షించారు.  ఒక కుటుంబానికి బీమా నమోదు చేయడానికి దాదాపు ఎంత సమయం అవుతుందో స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. స్థానిక అధికారులంతా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రజలంతా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద నమోదయ్యేలా చొరవ చూపాలని తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న వారికి అర్థమయ్యేలా తెలియజేయాలని అన్నారు. ప్రక్రియ పూర్తి చేసిన కుటుంబాల వివరాలన్నీ స్పష్టంగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో సిపిఓ గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, స్థానిక కౌన్సిలర్ సురేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.