BREAKING
ఏ.కొండూరులో పులి సంచారంపై పవన్ కల్యాణ్ సమీక్ష.. నో వార్నింగ్ డైరెక్ట్ యాక్షన్.. ఐలాపూర్ తాండాలో కూచివేతల మోత ఒకే దెబ్బకు 75 అక్రమ నిర్మాణాలు ఖతం ఈనెల 23న దర్శి మున్సిపల్ చైర్మన్ గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం. హోర్ముజ్‌ జలసంధి సమీపంలో మరో చమురు రవాణా నౌకపై దాడి పేద కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం  అందోల్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి అరుణ కుమారి గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు! ఎర్రగూడూరు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గట్టు శివ గౌడ్ నామినేషన్ దాఖలు ట్రెజరీ,పే అండ్ అకౌంట్స్ శాఖకు చెందిన 30 మంది ఉద్యోగులు టీఎన్జీవోలో చేరిక బీహార్‌లో రూ.4,280 కోట్ల నితీశ్‌ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖ ఉక్కు అమ్మకాన్ని తక్షణమే ఆపాలి పుట్టపర్తి లో దివ్య నామస్మరణ ప్రారంభం బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌

గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు!

Select Suryaa Now
గంజాయి సాగు.. విక్రయాల గుట్టురట్టు!

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (పన్నాల బాల్ రెడ్డి):    గంజాయి సాగు చేస్తూ, ఎండు గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై 22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ జోన్‌-1 బృందం, జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్, సంతోషీనగర్‌లో తనిఖీలు నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.    నిందితుడి నుంచి సుమారు రెండడుగుల ఎత్తున్న రెండు గంజాయి మొక్కలు, నాలుగు గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.5 వేలుగా పోలీసులు వెల్లడించారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న మూలాలను గుర్తించడంతో పాటు, ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతర నిఘా, కఠిన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గంజాయి విక్రయాలు, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.