పేద కుటుంబాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అందోల్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి అరుణ కుమారి
అందోల్ : నిరుపేద కుటుంబాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా ఇన్చార్జ్ మర్రి అరుణకుమారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం” నమోదు ప్రక్రియను 3వ వార్డు కౌన్సిలర్ మర్రి అరుణకుమారి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలకు ఇందిరమ్మ భీమా ముఖ్య ఉద్దేశాలు, అర్హతలు, ప్రయోజనాల గురించి వివరించారు. లబ్ధిదారులకు పథకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రేషన్ కార్డులో పేర్లు కలిగి ఉండి, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందించాలని ఉద్దేశంతో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిందన్నారు. ఇందిరమ్మ భీమతో కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.