నో వార్నింగ్ డైరెక్ట్ యాక్షన్.. ఐలాపూర్ తాండాలో కూచివేతల మోత ఒకే దెబ్బకు 75 అక్రమ నిర్మాణాలు ఖతం
అమీన్ పూర్ ; అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఐలాపూర్ చిన్న తండాలో శనివారం తెల్లవారుజాము నుండి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులకు రెవెన్యూ, జిహెచ్ఎంసి, పోలీస్ శాఖలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.
అమీన్పూర్ తాండ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలను భారీ పోలీస్ పందోబస్తు నడుమ అధికారులు నేలమట్టం చేశారు.
తెల్లవారుజామునే హై టెన్షన్.. ఆపరేషన్ క్లీన్, అమీన్పూర్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో కబ్జాదారుల కన్ను విలువైన ప్రభుత్వ భూముల పై పడింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా తాండా పరిధిలో అక్రమంగా కట్టడాలు బేస్మెంట్లు నిర్మిస్తున్నారన్న పక్క సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు.
ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తెల్లవారుజామునే భారీ యంత్రాలు జెసిబిలు వందలాది మంది పోలీసులతో అధికారులు అక్కడికి చేరుకున్నారు.
కాకి కవచంలో జెసిబిల గర్జన, కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కబ్జాదారులు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా నడుమ జెసిబిలు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన కట్టడాలను ప్రహరీ గోడలను బేస్మెంట్లను క్షణాల్లో నేలమట్టం చేశాయి.తహసిల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన 75 అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, జిహెచ్ఎంసి ,పోలీస్ అధికారుల సంయుక్తంగా గుర్తించి అక్రమ నిర్మాణాలను పూర్తిగా నీలమట్టం చేసాం అని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఇలాగే కూల్చివేయడమే కాకుండా, కబ్జాదారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రావణి, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.