కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామం కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు వాకిటి జయరాం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అభివృద్ధి కోసం కృషి చేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అందుకు తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ ఈ రాజీనామాలు మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు పంపుతున్నట్లు తెలిపారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.