BREAKING
బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్.. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు

Select Suryaa Now
అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు

అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్తూరు రూరల్ మండలం అనంతా  పురం గ్రామ సర్పంచిగా ప్రవీణ్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన టిడిపి నాయకులు కార్యకర్తలు తన అనుచరులు అభిమానులతో కలిసి ర్యాలీగా స్థానిక బిఎన్ఆర్ పేట గ్రామ సచివాలయానికి వెళ్లి తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ అనంతపురం గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నానన్నారు. ఇదివరకే తాను తమ పంచాయితీ పరిధి లోని అనంతా పురం తో పాటు పరిసర గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా అనంతపురం గ్రామం నుంచి బి ఎన్ ఆర్ పేట చెక్ పోస్ట్ వరకు తన సొంత నిధులతో వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను సర్పంచిగా విజయం సాధిస్తే చిత్తూరు రూరల్ మండలంలోని తమ అనంతపురం పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. దీన్ని గ్రామపంచాయతీలోని ఓటర్లు అందరూ గ్రహించి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ సందర్భంగా ప్రవీణ్ నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం గ్రామ పంచాయతీ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.