BREAKING
బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్.. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్..

Select Suryaa Now
మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్..
విజయవాడ, నవంబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ వేడుక వేదిక ఎంపికపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూటమి నేతలు, నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా తిప్పికొట్టారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విపక్షాల తీరుపై మండిపడ్డారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమంపై కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని, విమర్శలు చేసే ముందు వారు అసలు నిబంధనలు (రూల్ పొజిషన్) ఏంటో తెలుసుకోవాలని మేయర్ వంగవీటి రాధా సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా కొందరి వ్యవహారం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమది కేవలం మాటల ప్రభుత్వం కాదని, ప్రజలకు సేవ చేసే చేతల ప్రభుత్వమని వంగవీటి రాధా స్పష్టం చేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని, నగరంలోని 98.4 శాతం డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. అధికారులు పూర్తి స్థాయి నిబంధనల ప్రకారమే ప్రమాణ స్వీకార వేదికగా అంబేద్కర్ కళావేదికను ఎంపిక చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విపక్షాలపై ధ్వజమెత్తారు. తెరపైకి వచ్చి మాట్లాడిన వారిని కాదు, వెనుక ఉండి మాట్లాడిస్తున్న వారిని తాము ప్రశ్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. నగర ప్రజలు కూటమికి అందించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అంకితం చేయాలని తాము భావించామని, అనవసర వివాదాలు సృష్టిస్తున్న వారు అంబేద్కర్‌కు తక్షణమే క్షమాపణ చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.