telangana
పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 21: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. అయితే సికింద్రాబాద్ డీసీపీ ప్రత్యేక బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, కేవలం గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ కేసును ఛేదించి పసికందును సురక్షితంగా రక్షించింది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ మహిళ ఏడు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది మూడో కాన్పు కాగా, వరుసగా మూడోసారి కూడా ఆడబిడ్డే పుట్టడంతో నిందితుల ముఠా ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రాప్ చేసింది. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాల కింద భారీగా డబ్బులు వస్తాయని సదరు మహిళను నిందితులు మాయమాటలతో నమ్మించారు.
అనంతరం ఆ మహిళ దృష్టి మరల్చి, ఏడు రోజుల పసికందును ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేసి, ఆ చిన్నారిని మరొకరికి లక్ష రూపాయలకు విక్రయించారు.