BREAKING
రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే.

మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి.......

Select Suryaa Now
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి.......

మద్దూర్ …భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్సు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు ఇట్టబోయిన కనక చంద్రం, సుందరగిరి సత్యనారాయణ లు పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పై సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్సు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధుల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజకీయ విమర్శలు విధానాలు ప్రజా సమస్యలకే పరిమితం కావాలని వ్యక్తిగత దూషణలు పరుష పదజాలం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మెప్పు పొందాలని అతని మోచేతి నీళ్లు తాగడం కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తిట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. వెంటనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పుల్లూరి రాజు, పార్టీ మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బియ్య మహేష్, సీనియర్ నాయకులు ముంతాజ్ హుస్సేన్, ఫసి, సుధాకర్ రెడ్డి, యూత్ నాయకులు శ్రీరాముల వెంకటేష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.