BREAKING
రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు మత్తు మహమ్మారికి దూరంగా ఉండాలి - సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినుల ర్యాలీతో ప్రజల్లో చైతన్యం ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఎల్లమ్మ ఆలయంలో ఏకబిల్వం మొక్క నాటిన గౌడ సంఘం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు బహిరంగ క్షమాపణ చెప్పాలి....... భైరవానితిప్ప సర్పంచ్ అభ్యర్థి ఏగాగ్రీవం... జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షులుగా వెంకటేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణపై భూ బాధితుల సమరభేరి.. ఐక్య పోరాటానికి జేఏసీ ఏర్పాటు మళ్లీ మొదలైన పెళ్లిళ్లు..కళకళలాడుతున్న తెలుగు ముంగిళ్ళు.. వెట్‌ల్యాండ్ లను పరిరక్షించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు_ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ లబ్ధిదారులకు చేయూత ప్రెసిడెంట్ అందజేత అంతమ్మ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నూతన జడ్పీ చైర్మన్ గంజె నాగరాజు ఘనంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే.

జిల్లా స్థాయి పాత్రధారణ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు బీరంగూడ పాఠశాల బృందం ఎంపిక

Select Suryaa Now
జిల్లా స్థాయి పాత్రధారణ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు.. రాష్ట్ర స్థాయి పోటీలకు బీరంగూడ పాఠశాల బృందం ఎంపిక

సంగారెడ్డి,  : రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి తెలంగాణ, సమగ్ర శిక్షా సంగారెడ్డి ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి పాత్రధారణ పోటీలు శనివారం సంగారెడ్డిలోని జిల్లా విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా విద్యాశాఖాధికారిణి రోహిణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు వివిధ అంశాలపై పాత్రధారణ ద్వారా సందేశాత్మక ప్రదర్శనలు ఇచ్చి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు.పోటీల్లో విజేతలు..ప్రథమ బహుమతి: జెస్సీ మరియు బృందం – జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బీరంగూడ, అమీన్‌పూర్ మండలం. ఈ బృందం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.ద్వితీయ బహుమతి: ఆర్. మీనాక్షి మరియు బృందం – జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దౌల్తాబాద్, హత్నూర మండలం.తృతీయ బహుమతి: పి. హరిస్మిత మరియు బృందం – తెలంగాణ మోడల్ పాఠశాల, గుండ్లమాచనూర్, హత్నూర మండలం.ఈ కార్యక్రమంలో సహాయ మండల అధికారి బి. బాలయ్య, జిల్లా క్రీడా అధికారి సిద్ధారెడ్డి, ప్రాథమిక విద్యా బృంద సభ్యులు శ్రీకాంత్, మహేష్‌తో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ప్రథమ బహుమతి సాధించిన బీరంగూడ పాఠశాల బృందం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుండటంతో నిర్వాహకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.