BREAKING
కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. కె ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్ సి సి యూనిట్ మంజూరు ప్రముఖ సింగర్ కనిక కపూర్ సంచలన నిర్ణయం.. భర్త గౌతమ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటన మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది రామాయణంపై వస్తున్న విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా.. హాలీవుడ్ స్థాయిలోనే అద్భుత దృశ్యకావ్యం వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: భారీ పోలీస్ బందోబస్తు బియ్యం నాణ్యత లో రాజీ పడొద్దు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై రణ్‌బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. మానవ స్పర్శకు ఎప్పటికీ సాటి రాదంటూ స్పష్టత ముగసిన ఉర్సు ఉత్సవాలు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్.. మండలంలో పర్యటించిన కలెక్టర్ గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు.. 10వడివిజన్ కార్పొరేటర్ గా రాణి ఘనవిజయం స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ

Select Suryaa Now
మెకానిక్ కుటుంబాలకు టపాసులు పంపిణీ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : దీపాలు పండుగ రోజున ప్రతి మెకానిక్ కార్మికుల కుటుంబాలలో సంతోషపు వెలుగులతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీబాలాజి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు టపాసులు పంపిణీ చేశారు. యూత్ హాస్టల్లో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాళ్లపాక ముని దేవరాజులు ముఖ్యఅతిథిగా హాజరై 120 మంది మెకానిక్ కార్మికులకు టపాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ పర్వదినాలతో పాటు ప్రతి కార్మికుడికి అండగా నిలిచి వారి సంక్షేమానికి అసోసియేషన్ నిరంతర కృషి చేస్తుందని, అసోసియేషన్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీబాలాజి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.మోహన్, వైస్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖర్, సెక్రటరీ వీఎస్ హరిప్రసాద్, ట్రెజరర్ ఎస్ షఫీ, జాయింట్ సెక్రటరీ వి.ఆనంద్, కమిటీ సభ్యులు మునిరెడ్డి, జాకీర్, నాగరాజు, మధుకుమార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్