కె ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కళాశాలకు ఎన్ సి సి యూనిట్ మంజూరు
.
కోదాడ (మేజర్ న్యూస్)కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలకు 2026-27 విద్యా సంవత్సరంకు ఎన్ సి సి యూనిట్ మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హదసారాణి బుధవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. నలగొండ 31(t) బెటాలియన్ కింద ఈ ఎన్ సి సి యూని ట్ పనిచేస్తుందని తెలిపారు. ఎన్ సి సి కి మొత్తంగా104 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుం దని అందులో ఈ విద్యా సంవత్సరం 34 మంది మొదటి సంవత్సరం విద్యార్థు లకు అడ్మిషన్ ఉంటుందన్నారు. విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుం దని తెలిపారు. ఎన్ సి సి లో చేరే విద్యార్థు లకు ఈనెల 7 శనివారం రోజున ఎంపిక ప్రక్రియ లో భాగంగా 1.2 కిలోమీటర్ల పరుగు పందెం, ఇతర శారీరక ధారుడ్య పరీక్షలు నల్గొండ బెటాలియన్ కమాండెట్, ఎన్ సి సి కేర్ టేకర్ ఆఫీసర్ టి. రాజు నిర్వహిస్తారని తెలి పారు. అబ్బాయిలకు 5 అడుగుల 6 ఇంచు లు, అమ్మాయిలకు 5 అడుగుల 3 ఇంచుల ఎత్తు ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశా లలో ఎన్సిసి కేర్ టేకర్ ఆఫీసర్ టి రాజును సంప్రదిం చాలని తెలిపారు.