కంటి చూపు కోసం గాయకుడు సునీల్ లోధీ కీలక అడుగు.. భావోద్వేగ పోస్ట్ వైరల్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హనుమాన్ అంశ్ చిత్రంలోని భక్తి పాటతో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న దృష్టి లోపం ఉన్న ప్రముఖ జానపద గాయకుడు సునీల్ లోధీ తన జీవితంలో నూతన ఆశలతో ముందుకు అడుగుపెట్టారు. తన అద్భుతమైన గొంతుతో లక్షలాది మంది సంగీత ప్రియుల మనసులను గెలుచుకున్న ఆయన, తాజాగా తన కంటి చూపును తిరిగి పొందడం కోసం వైద్య చికిత్సను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆయన చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో కదిలిస్తోంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాల మేరకు సునీల్ లోధీ కంటి వైద్య చికిత్స ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సాగర్‌లోని బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీలో ఆయన సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ప్రత్యేక కంటి పరీక్షలను కూడాపొందారు. ఈ చికిత్స ద్వారా తన కంటి చూపు మళ్లీ వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నానని, ఈ అందమైన ప్రపంచాన్ని తన సొంత కళ్లతో చూసే అదృష్టం తనకు దక్కాలని భవుడిని ప్రార్థిస్తున్నట్లు సునీల్ పేర్కొన్నారు. తన జీవితంలో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ దేవుడు తనకు అండగా నిలిచాడని, ఇప్పుడు ఈ వైద్యం ద్వారా తనకు చూపు ప్రసాదించాలని ఆయన భావోద్వేగంతో రాసుకొచ్చారు.
సాధారణ జానపద గాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్ లోధీ, సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భక్తి పాటల ద్వారా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత హనుమాన్ అంశ్ చిత్రంలో ఆయన ఆలపించిన పాటలు సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఆయన ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు మరియు స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించి వైద్య సాయం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. సాగర్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడ కూడా భక్తి గీతాలు ఆలరించి అధికారులను ఆకట్టుకున్నారు.
తనకు అండగా నిలుస్తున్న అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ప్రార్థనలే తనకు అసలైన బలమని సునీల్ లోధీ తెలిపారు. వైద్యులు అందిస్తున్న చికిత్స విజయవంతమై త్వరలోనే తాను ఈ లోకాన్ని కళ్లారా చూడగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సునీల్ లోధీ త్వరగా కోలుకుని పూర్తి దృష్టితో మళ్లీ తన మధురమైన పాటలతో మరింత వినోదాన్ని పంచాలని ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆశీస్సులు అందిస్తున్నారు.
Also Read: ధన్తేరస్ పర్వదినాన ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించాలి