BREAKING
గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా?

'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' ఓటీటీ రిలీజ్.. నవంబర్ 6 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్

Select Suryaa Now
'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' ఓటీటీ రిలీజ్.. నవంబర్ 6 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మనుషుల మధ్య బంధాలు, జ్ఞాపకాలకు విలువనిచ్చే ఒక భావోద్వేగభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్. ఎంతటి భారీ మొత్తాలు ముట్టజెప్పినా ప్రాణంగా ప్రేమించే ఇంటిని, జ్ఞాపకాలను వదులుకోవడం సామాన్యుడికి ఎంత కష్టమనే కోణంలో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, బొమన్ ఇరానీ మరియు దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఆలోచింపజేసే చిత్రం నవంబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా, బెన్ రేఖి దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత రచయిత అరవింద్ అడిగా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా సూనీ తారాపోరేవాలా స్క్రిప్ట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ముంబైలోని ఒక పాత హౌసింగ్ సొసైటీని రీడెవలప్‌మెంట్ చేసే క్రమంలో బిల్డర్ ఇచ్చే భారీ ఆఫర్‌కు మిగతావారంతా అంగీకరించినా, రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ యోగేశ్ మిశ్రా పాత్రధారి అయిన మనోజ్ బాజ్‌పాయ్ మాత్రం తన జ్ఞాపకాల నిలయమైన ఇల్లును వదిలేందుకు నిరాకరిస్తాడు. అందరి ఆశలకు అతడొక్కడే అడ్డుపడుతున్నాడంటూ సొసైటీలోని వారంతా అతడిని వ్యతిరేకించే నేపథ్యంలో సాగే ఈ పోరాటం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో గృహిణిగా దివ్య దత్తా, డెవలపర్ పాత్రలో బొమన్ ఇరానీ తమ నటనతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. నగరాల్లోని రీడెవలప్‌మెంట్ హడావుడి వెనుక ఉండే మానవీయ కోణాలను, కుటుంబాలపై పడే ప్రభావాలను ఈ చిత్రంలో సహజంగా ఆవిష్కరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కేవలం నాలుగు గోడల మధ్య ఉండే సంబంధాలను మాత్రమే కాకుండా మనుషుల భావోద్వేగాలను కళ్లకు కట్టేలా తెరకెక్కించిన ఈ భావోద్వేగభరితమైన డ్రామా ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.