*పేదవాడి సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పేటలో గొల్ల రాములు స్వప్న దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ బుధవారం ప్రారంబించారు. అనంతరం ఆ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కట్టు కోవడం పేదల జీవితంలో ఒక కల అని, ఆ కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్ సహకారంతో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నారన్నారు. అర్హులైనా వారందరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పల్లె కృష్ణ, వీరేశం, గొల్ల విఠల్, గొల్ల సాయిలు, కుమ్మరి కృష్ణ, గొల్ల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు