BREAKING
మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి

మహిళా శక్తి భవనాలు ప్రారంభించేది ఎప్పుడు?

Select Suryaa Now
మహిళా శక్తి భవనాలు ప్రారంభించేది ఎప్పుడు?

కొండాపూర్;మహిళా సంఘాల కోసం నిర్మించిన ద్వాక్రా భవనాలు ప్రారంభానికి నోచుకోకపోవడంతో మహిళలు ఎదురుచూస్తున్నారు. మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా నిర్మించిన భవనాలు పూర్తయి నెలలు గడుస్తున్నా  వినియోగంలోకి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున ద్వాక్రా భవనాలు మంజూరయ్యాయి. గత ఏడాది ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు చేయగా, పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో పది భవనాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన భవనాలు  త్వరలో పూర్తయ్యే దశలో ఉన్నాయని పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ప్రారంభోత్సవం కోసం మహిళల ఎదురుచూపులు భవనాలు పూర్తయినా ప్రారంభించకపోవడంతో ద్వాక్రా మహిళలకు వాటి సేవలు అందడం లేదు. సమావేశాలు, సంఘాల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సొంత వసతి కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండటం మహిళలను నిరాశకు గురిచేస్తోంది.ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పూర్తయిన పది ద్వాక్రా భవనాలను వెంటనే ప్రారంభించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు. మిగిలిన భవనాల పనులను  త్వరితగతిన పూర్తి చేసి అన్ని గ్రామాల్లో మహిళా శక్తి భవనాల సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.